గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భారీ బందోబస్తు నడుమ నామినేషన్ల ప్రక్రియ
జీహెచ్ఎంసీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఈ మేరకు నగరంలోని శేరిలింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులను తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
భారీ బందోబస్తు నడుమ నామినేషన్ల ప్రక్రియ
కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో ఇద్దరిని లోపలికి అనుమతిస్తున్నారు.
ఇదీ చదవండి:'జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్లు కొనేందుకే తెరాస నాటకం'