Police Security Arrangements for Telangana Elections :పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఓటర్లు నిర్భయంగా పోలింగ్ కేంద్రాలకు(Polling Centers) చేరుకొని ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 144వ సెక్షన్‌ను విధించారు. 28వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 30వ తేదీ ఉదయం 6గంటల వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈసీ ఆంక్షలు..:ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్లు మూసివేయాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. 28వ తేదీ సాయంత్రం 5గంటల నుంచి 30వ తేదీ సాయంత్రం 6గంటల వరకు మద్యం, కల్లు దుకాణాలు మూసేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎన్నికల కోసం భారీ బందోబస్తు కేటాయించారు.
తొలిసారి ఓటు వేసేందుకు ఉవ్విళ్లూరుతున్న యువతరం
Security Arrangements in Election Duty :ఇందులో 45వేల మంది రాష్ట్ర పోలీసులు(State Police).. 3వేల మంది ఇతర శాఖలకు చెందిన ఖాకీలు, 50 కంపెనీల స్పెషల్ పోలీసులు, 375 కంపెనీలకు చెందిన కేంద్ర బలగాలు బందోబస్తు విధుల్లో పాల్గొననున్నారు. వీళ్లకు అదనంగా 23500 మంది హోంగార్డులు సైతం ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. కర్నాటక నుంచి 5వేల మంది హోంగార్డులు, మహారాష్ట్ర నుంచి 5వేలు, ఛత్తీస్‌గఢ్ నుంచి 2500, మధ్యప్రదేశ్ 2వేలు, ఒడిషా నుంచి 2వేల మంది హోంగార్డులు విధులు నిర్వహించనున్నారు.
Tight Security in Election Poling Stations :సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో అదనపు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసులతో పాటు కేంద్ర సాయుధ బలగాలను(Central Armed Forces) సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో కేటాయించనున్నారు. కెమెరా మౌంటెడ్ వాహనాలను అక్కడ మొహరించనున్నారు. గస్తీ వాహనాలు సైతంపోలింగ్ కేంద్రాలపరిసరాల్లో చక్కర్లు కొట్టనున్నాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఏదైనా సమస్య తలెత్తినట్లు తెలియగానే నిమిషాల్లో అక్కడికి చేరుకునే విధంగా క్విక్ రియాక్షన్ టీమ్‌లను ఏర్పాటు చేశారు.