తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆర్కే జీవిత చరిత్ర ముద్రణ... పుస్తకాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు - తెలంగాణ వార్తలు

హైదరాబాద్‌లోని నవ్య ప్రింటింగ్‌ ప్రెస్‌లో హంగామా జరిగింది. ఇటీవల మరణించిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే జీవిత చరిత్ర (Maoist Leader RK biography) ముద్రిస్తున్నారని పోలీసులు తనిఖీ చేశారు. అయితే పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరించారని... న్యూ డెమోక్రసీ ఆరోపించింది.

Maoist Leader RK biography
మావోయిస్టు అగ్రనేత జీవిత చరిత్ర పుస్తకాలు

By

Published : Nov 13, 2021, 7:47 AM IST

Updated : Nov 13, 2021, 8:21 AM IST

హైదరాబాద్‌ అంబర్‌పేట మూసారాంబాగ్‌లోని నవ్య ప్రింటింగ్‌ ప్రెస్‌ గోదాములో శుక్రవారం సాయంత్రం డీసీపీ రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఇటీవల మృతి చెందిన మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే (Maoist Leader RK) జీవిత చరిత్ర (Maoist Leader RK biography)ను పుస్తక రూపంలో ముద్రిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు నిర్వహించారు. వెయ్యి పుస్తకాలు (Maoist Leader RK biography) స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ ప్రజాభద్రత చట్టం మేరకు సుమోటోగా కేసు నమోదు చేశామని మలక్‌పేట పోలీసులు తెలిపారు. నవ్య ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. నేరం రుజువైతే అరెస్టు చేస్తామని వెల్లడించారు.

మావోయిస్టు అగ్రనేత జీవిత చరిత్ర పుస్తకాలు స్వాధీనం

పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారని రామకృష్ణారెడ్డి భార్య, ప్రగతిశీల మహిళా సంఘం జాతీయ అధ్యక్షురాలు సంధ్య ఆరోపించారు. ఆర్కే భార్య (Maoist Leader RK Wife) శిరీష కోరిక మేరకు తానే పుస్తక ప్రచురణకు (Maoist Leader RK biography) ఒప్పుకున్నానని చెప్పారు. తన భర్త అనారోగ్యంతో ఉన్నారని చెప్పినా దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తన భర్త స్మృతులతో భార్య పుస్తకం రాసుకుంటే అది నిషేదం ఎలా అవుతుంది? ఒక ఇన్​ ప్రింట్​తో వేసుకున్నప్పుడు అది రహస్యంగా వేసుకున్నది కాదు. ప్రచురణ కర్త శిరీష అని ఉంది ఇక్కడ. మాకు వచ్చిన ఆర్డర్లు, రాబోయే ఆర్డర్లు అన్ని తీసుకుని వెళ్లిపోయారు. నా భర్త ఆరోగ్యం అసలు బాగాలేదు. సీరియస్ కండీషన్​లో ఉన్న అతనిని తీసుకెళ్లిపోయారు.

సంధ్య, పీఓడబ్యూ జాతీయ అధ్యక్షురాలు

తన భర్త జ్ఞాపకాలను పుస్తక రూపం (Maoist Leader RK biography)లో తీసుకొస్తే అడ్డుకోవడం సరికాదని ఆర్కే భార్య (Maoist Leader RK Wife) శిరీష ఆవేదన వ్యక్తం చేశారు.

చాలా వ్యాసాలు. ప్రభుత్వం శాంతి చర్చలకు వచ్చినప్పుడు మాట్లాడిన విషయాలు..పేపర్లో కటింగ్స్ అవిన్నీ తీసుకుని.. రహస్యం అయితే ఏమి లేదు. అలాంటివన్నీ సేకరించి నేనొక జ్ఞాపకంగా పుస్తకం వేసుకోవాలి అనుకున్నాను. ఇది చాలా అమానుషం. ఈ మొత్తం భయబ్రాంతులకు గురిచేసి.. పుస్తకాలు, సిస్టమ్స్ అన్నీ తీసుకెళ్లడమంటే.. అసలు ఏంటి? ప్రభుత్వం చేసే ఈ దుర్మార్గ చర్యలను ఎవరు ఆపాలి.

శిరీష, ఆర్కే భార్య

నవ్య ప్రింటింగ్‌ ప్రెస్‌లో పోలీసుల తీరును సీపీఐ ఎమ్​ఎల్​ న్యూ డెమోక్రసీ ఖండించింది. పుస్తకం (Maoist Leader RK biography)లో అభ్యంతరకరమైన విషయాలు ఉంటే పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి గానీ.. ఎటువంటి సమాచారం లేకుండా దాడిచేసి ప్రింటింగ్‌ ప్రెస్‌ సామగ్రి తీసుకెళ్లడం అప్రజాస్వామికమని ప్రెస్‌నోట్‌ విడుదల చేసింది.

ఇదీ చూడండి:Maoist Rk Family:'ఆర్కేది ప్రభుత్వ హత్యే... మృతదేహాన్ని మాకు అప్పగించండి'

Maoist Leader RK Funeral : అడవిలోనే ఆర్కే అంత్యక్రియలు.. ఆయన చివరి లేఖలో ఏముందో తెలుసా?

RK funeral photos: ఆర్కే అంత్యక్రియలు పూర్తి.. ఫొటోలు విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

Maoist leader rk passed away: మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి.. ధ్రువీకరించిన పోలీసులు

Last Updated : Nov 13, 2021, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details