తెలంగాణ

telangana

ETV Bharat / state

యువతి కిడ్నాప్​ కేసులో దొరకని రవిశేఖర్​ ఆచూకీ - కిడ్నాపర్​ రవిశేఖర్​కై వెతుకులాట

సంచలనం కలిగించిన ఇబ్రహీంపట్నం బొంగులూరుకు చెందిన యువతి సోని కిడ్నాప్​ కేసులో నిందితుని ఆచూకీ లభించలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు రవిశేఖర్​ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. యువతి అపహరణకు గురై వారం రోజులు గడుస్తున్నా... ఎలాంటి ఆధారాలు లభించకపోవడం వల్ల ఈ కేసు పోలీసులకు పెను సవాలుగా మారింది.

నిందితుడు రవిశేఖర్​

By

Published : Jul 29, 2019, 11:52 PM IST

ఇబ్రహీంపట్నం మండలం బొంగులూరుకు చెందిన యువతి సోని అపహరణకు గురై వారం రోజులు గడిచినా ఆమె ఆచూకీ లభించడం లేదు. నిందితుడు రవిశేఖర్​ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. కర్నూలు, కడప జిల్లాల్లో నిందితుడు కారులో సంచరించాడన్న సమాచారంతో స్థానిక పోలీసుల సహకారంతో ఆయా ప్రాంతాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా గాలింపు చేపడుతున్నారు. రవిశేఖర్​ యువతిని ఎక్కడికి తీసుకెళ్లాడనేది పోలీసులకు అంతుచిక్కడం లేదు.

లక్ష రూపాయల నజరానా

నిందితుని ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు ఇప్పటికే లక్ష రూపాయల నజరానా ప్రకటించారు. నిందితుడు రవిశేఖర్​పై తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలోనూ పలు కేసులున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 23న ఉద్యోగం ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి సోనీ అనే బీ ఫార్మసీ విద్యార్థినిని రవిశేఖర్​ అనే నిందితుడు కారులో అపహరించుకుపోయాడు. హైదరాబాద్​లో యువతిని అపహరించడానికి రెండు రోజుల ముందు తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలోనూ ఇద్దరు మహిళలను మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇదీ చూడండి : 'పారిక్​ కేసులో కిడ్నాపర్​లను త్వరలోనే పట్టుకుంటాం'

ABOUT THE AUTHOR

...view details