Saikrishna statement in Apsara murder case : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో శంషాబాద్ గ్రామీణ పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. నిందితుడు సాయికృష్ణను వెంట పెట్టుకొని హత్య జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ వద్ద కారులో అప్సరను హత్య చేసిన చోటును పరిశీలించారు. అక్కడ అప్సరను సాయి కృష్ణ ఎలా హత్య చేశాడో నిందితుడ్ని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత నేరుగా సరూర్‌నగర్ వెళ్లారు. మ్యాన్‌హోల్‌లో అప్సర మృతదేహాన్ని పడేసిన చోటుకు సాయికృష్ణను తీసుకెళ్లారు. అక్కడ మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో ఎలా పడేశాడో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహం పడేసిన రెండు రోజుల తరువాత సాయికృష్ణ, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపి ఆ తర్వాత సిమెంట్‌తో కాంక్రీట్ వేశాడు. మ్యాన్ హోల్ మట్టి వేసిన కూలీలను పోలీసులు ఘటనా స్థలానికి పిలిపించారు. ఇద్దరు కూలీలతో కలిపి సాయికృష్ణను ప్రశ్నించారు. మ్యాన్‌హోల్ పూడ్చే సందర్భంగా సాయికృష్ణ చెప్పిన మాటలను కూలీలు.. పోలీసుల ఎదుట వివరించారు.
- Apsara Murder Case Update : అప్సర హత్య కేసు.. ఆ తప్పే సాయికృష్ణను పట్టించేసింది
- Apsara Case Remand Report : "How to Kill human being" అని గూగుల్‌లో సెర్చ్ చేసిన సాయికృష్ణ
Saroornagar Apsara Murder News : మ్యాన్‌హోల్ నుంచి దుర్వాసన వస్తోందని మట్టి పోయాలని సాయికృష్ణ చెప్పిన మాటలను ఇద్దరు కూలీలు వివరించారు. కూలీల వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేసుకున్నారు. వనస్థలిపురం ఇసుక అడ్డ వద్దకు వెళ్లి గుంత పూడ్చడానికి కావలసిన ఎర్రమట్టిని తీసుకువచ్చేందుకు కూలీలతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. కూలీలకు సగం డబ్బులు మాత్రమే ఇచ్చినట్లు.. మిగతా డబ్బుల కోసం ఫోన్ చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.