Police Said to Be Careful on Social Media :ఆన్‌లైన్ వినియోగం క్రమంగా పెరుగుతోంది. సెల్‌ఫోన్ నిత్యావసరం అయిపోయింది. స్మార్ట్ ఫోన్‌లు చేతిలోకి వచ్చిన తర్వాత దూరం తగ్గిపోయింది. ఎక్కడో ఉన్న వ్యక్తితో సమాచారం క్షణాల్లో చేరవేస్తున్నాం. దీనికోసం సామాజిక మాధ్యమాలైన (Social Media) ఫేస్‌బుక్, ఎక్స్(ట్విటర్), ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రాంలను వినియోగిస్తున్నాం. ఈ క్రమంలో మోసగాళ్లు అమాయకులైన యువతులకు ఫేస్‌బుక్‌లో వల వేస్తున్నారు. ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించి స్నేహం పేరుతో దగ్గరవుతున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు సేకరిస్తున్నారు. ఫొటోలు, వీడియోలను సేకరించి వాటిని మార్పింగ్ చేసి డబ్బులు వసూలు చేయడం, లైంగిక కోరిక తీర్చుకోవడం లాంటి మోసాలకు పాల్పడుతున్నారు.
Pub G గేమ్‌లో పరిచయం.. ఆల్కహాల్ తాగించి రేప్.. ఆపై న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిల్
ఇటీవలే హైదరాబాద్‌లో ఉండే ఓ మైనర్ బాలికకు ఆర్నెళ్ల క్రితం.. ఓ అపరిచిత వ్యక్తి నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. వెంటనే బాలిక రిక్వెస్ట్‌ను అంగీకరించగా గుర్తు తెలియని యువకుడు తరచూ చాటింగ్ చేసేవాడు. ఆ తర్వాత ఒకరి ఫోన్‌నెంబర్లు, ఇంకొకరికి ఇచ్చిపుచ్చుకున్నారు. వాట్సాప్‌లో వీడియోకాల్స్ చేసుకున్నారు. మూడు నెలల తర్వాత ఆ అమ్మాయి వాట్సాప్‌కు యువకుడు వీడియోలు పంపించాడు. అవి చూసిన అమ్మాయి ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది.
వీడియో కాల్ చేసినప్పుడు స్క్రీన్ రికార్డ్ చేసి వాటినే సాంకేతికతతో మార్ఫింగ్ చేసినట్లు బాలిక గుర్తించింది. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పుకోలేక.. తనలోనే కుమిలిపోయింది. యువకుడు క్రమంగా బెదిరింపులకు పాల్పడటం మొదలుపెట్టాడు. లైంగిక వాంఛ తీర్చకపోతే నగ్న దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచుతానని బెదిరించాడు. భయపడిన యువతి నిందితుడు చెప్పినట్లు చేసింది. వేధింపులు తీవ్రం కావడంతో తల్లిదండ్రుల సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Police Precautions on Using Social Media :పోలీసుల నిందితుడిని అరెస్ట్ చేశారు. వారం వ్యవధిలో హైదరాబాద్ పోలీసులకు ఫేస్‌బుక్ స్నేహితుల వల్ల మోసపోయిన.. మరో ఇద్దరు మైనర్ బాలికలు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సందీప్ శాండిల్య సూచించారు.