తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ నడిబొడ్డున వ్యభిచారం - వ్యభిచార ముఠా గుట్టు రట్టు

హైదరాబాద్​ శివారు రాజేంద్రనగర్​ ఉప్పర్​పల్లిలోని సన్​రైస్​ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా పోలీసులు అరెస్ట్​ చేశారు. ఆరుగురు యువతులు, ముగ్గురు విటులు, నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.

police rides on brothal house in Hyderabad
వ్యభిచార ముఠా గుట్టు రట్టు

By

Published : Dec 30, 2019, 3:16 PM IST

గుట్టు చప్పుడు కాకుండా హైదరాబాద్​ శివారు ప్రాంతం ఉప్పర్​పల్లిలోని సన్​ రైస్​ కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్​ చేశారు. దీపక్, మానిష్ శర్మ, ఇమ్రాన్.. ఓ ఫ్లాట్​ అద్దెకు తీసుకుని.. దిల్లీ, ముంబయి నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి గత 15 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నారు.

పీడీ యాక్టు నమోదు

పోలీసులు ఫ్లాట్​లో దాడి చేసి ఆరుగురు యువతులు, ముగ్గురు విటులు, నిర్వాహకులను అదుపులోకిత తీసుకున్నారు. యువతులను రెస్క్యూ హోమ్కు తరలించారు. 2016 నిందితుల్లో ఒకరిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

వ్యభిచార ముఠా గుట్టు రట్టు

ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు

ABOUT THE AUTHOR

...view details