Police Restrictions on New Year Celebrations 2024 : నూతన సంవత్సవ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలందరూ బాధ్యతాయుతంగా సహకరించాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు కోరారు. పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్‌హౌస్‌లు, వైన్‌షాపులు, ఈవెంట్ ఆర్గనైజేషన్ నిర్వాహకులతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రజలు, యువత ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారని అందుకే శాంతి భద్రతల సమస్య రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
న్యూయర్ వేడుకల(New Year Celebrations 2024) సందర్భంగా ట్రాఫిక్, ఎస్ఓటీ, షీ టీమ్స్, పెట్రోలింగ్ వంటి పోలీసు బృందాలు ఎటువంటి సంఘటనలు, నేరాలు జరగకుండా విధుల్లో ఉంటారని రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. అవుట్ డోర్ కార్యక్రమాలు జరిగే చోట డీజే బాక్సులకు అనుమతి లేదని సీపీ సుధీర్‌బాబు చెప్పారు. బాణసంచా కాల్చడానికి వీల్లేదని, పరిమితికి మించి ఈవెంట్లోకి ప్రేక్షకులను అనుమతించకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలపై ఎటువంటి వేధింపులు జరగకుండా నిరోధించడానికి షీ టీమ్స్ బృందాలు విధుల్లో ఉంటారని పేర్కొన్నారు.
కేరళ లాటరీలో కనకవర్షం.. రూ.16కోట్లు గెలుచుకున్న అజ్ఞాత వ్యక్తి
Rachakonda CP Sudheer Babu Restrictions on New Year Celebrations in Hyderabad : న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టడానికి ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేస్తామని చెప్పారు. అలాగే నిషేధిత డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల మీద ఉక్కుపాదం మోపుతున్నామని రాచకొండ సీపీ స్పష్టం చేశారు. నిర్దేశిత సమయంలోపు పబ్‌లు, బార్లు, వైన్‌షాపులు మూసి వేయాలని హెచ్చరించారు. మైనర్లకు మద్యం అమ్మే దుకాణాలపై కఠిన చర్యలు తప్పవని సీపీ సుధీర్ బాబు హెచ్చరించారు.
న్యూయర్ వేడుకలకు హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు :
- బహిరంగ ప్రదేశాలు, పబ్బులు, బార్లు, రెస్టారెంట్లు రాత్రి 1 గంట వరకే ఉండాలి
- న్యూఇయర్ వేడుకలు నిర్వహించే నిర్వాహకులు పది రోజుల ముందు నుంచే అనుమతులు తీసుకోవాలి
- ప్రతీ ఈవెంట్లో సీసీ కెమెరాలు,సెక్యూరిటీ సిబ్బంది తప్పనిసరిగా ఉండాలి
- అశ్లీల నృత్యాలకు అనుమతి లేదు
- న్యూయర్ వేడుకల్లో లౌడ్ స్పీకర్ల శబ్ధ తీవ్రత 45 డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉండకూడదు
- వేడుకలకు ఎవరూ కెపాసిటీకి మించి పాసులు ఇవ్వవద్దు
- వేడుకలు నిర్వహించే చోట పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలి
- లిక్కర్ వినియోగించే వేడుకల్లో మైనర్లకు అనుమతి లేదు
- నూతన సంవత్సర వేడుకల్లో డ్రగ్స్ వాడకూడదు
- మద్యం సేవించి వాహనం నడుపరాదు
- మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలలు జైలు శిక్ష, మూడు నెలలు పాటు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
క్రిస్మస్ రోజు ఈ కేక్స్ చేయండి - ఫ్యామిలీతో తియ్యని వేడుక చేసుకోండి!
హైదరాబాద్‌లో న్యూయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు - రాత్రి 1 గంట వరకే పర్మిషన్