No Permission to BJP Deeksha: రేపు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ధ భాజపా చేపట్టనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంతో భాజపా ఎమ్మెల్యేలను సభలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు సూచనను స్పీకర్ తిరస్కరించడాన్ని నిరసిస్తూ దీక్షకు పూనుకున్నారు.
No Permission to BJP Deeksha: భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు అనుమతి నిరాకరణ - ts news
No Permission to BJP Deeksha: రేపు భాజపా చేపట్టనున్న ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీక్షకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉందని.. దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
No Permission to BJP Deeksha: భాజపా ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్షకు అనుమతి నిరాకరణ
ఈ దీక్ష కోసం ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ధ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ జోన్ డీసీపీకి భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి దరఖాస్తు పెట్టారు. దరఖాస్తును పరిశీలించిన సెంట్రల్ జోన్ డీసీపీ.. దీక్షకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉందని, దీంతో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉన్నందున అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: