హైదరాబాద్‌లో నిర్మాణరంగ పనలు ప్రారంభమైన నేపథ్యంలో ఇక్కడే ఉండి పనిచేసుకోవాలని వలస కార్మికులకు నగర పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. సొంతూళ్లకు వెళ్తామంటూ పోలీస్ స్టేషన్ల వద్ద వందల సంఖ్యలో వలస కార్మికులు బారులు తీరుతుండడం వల్ల పరిస్థితి అదుపు తప్పుతోంది. దీంతో కూలీల వివరాల నమోదు కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. సంయుక్త కమిషనర్ డాక్టర్ తరుణ్‌జోషి, ఉత్తర మండలం డీసీపీ కల్మేశ్వర్ శింగన్వార్ వెయ్యి మంది వలస కార్మికులకు భోజనం అందించారు.
వలస కార్మికులకు పోలీసుల అభయం - ప్రత్యేక రైళ్లు
మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాద ఘటనతో తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. పోలీస్ ఉన్నతాధికారులు వలస కార్మికులుంటున్న క్యాంప్‌లు, ప్రాంతాలకు వెళ్లి భరోసా కల్పిస్తున్నారు. మీ స్వస్థలాలకు వెళ్లేందుకు రైళ్లు సమకూర్చడంలో కొంత ఆలస్యమవుతోందని, ఆందోళన చెందవద్దని కోరుతున్నారు.
![వలస కార్మికులకు పోలీసుల అభయం Hyderabad migrant workers latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7121646-8-7121646-1588992109539.jpg)
Hyderabad migrant workers latest news
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1.22 లక్షల మంది వలస కార్మికులు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు పేర్లను నమోదు చేసుకున్నారని, వారిని దశలవారీగా పంపుతున్నామని తరుణ్ జోషి తెలిపారు. సైబరాబాద్ పరిధిలో లక్ష మంది కార్మికులు ఉండగా, పలుచోట్ల రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారిని గుర్తించి పునరావాసం కల్పిస్తున్నారు.