హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బాబ్రీ మసీద్ కూల్చివేతపై సీబీఐ కోర్డు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా భద్రత కట్టుదిట్టం చేశారు.
పాతబస్తీలో భారీ బందోబస్తు - charminar latest news
బాబ్రీ మసీద్ కూల్చివేతపై సీబీఐ కోర్డు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానికులను గుమిగూడ నీయలేదు.
పాతబస్తీలో భారీ బందోబస్తు
ప్రధానంగా చార్మినార్, మక్కా మసీదు తదితర ప్రాంతాల్లో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. మక్కా మసీదులో ప్రార్ధనలు ముగిసేంత వరకు భద్రత కొనసాగింది. ఆయా ప్రాంతాల్లో స్థానికులను గుమిగూడనీయలేదు. ఎటువంటి ఆంక్షలు విధించకపోయినప్పటికీ... డీజేఎస్ కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి:మావోయిస్టు కీలక నేత అరెస్టు.. పేలుడు పదార్థాలు స్వాధీనం