తెలంగాణ

telangana

రామచంద్రభారతి, నందకుమార్‌లను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

By

Published : Dec 8, 2022, 5:19 PM IST

ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులు ఉదయం బెయిల్‌పై విడుదలవ్వగా... ఇతర కేసుల్లో పోలీసులు వారిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిని ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు.

Police produced Ramachandra Bharati and Nandakumar in the Nampally court
Police produced Ramachandra Bharati and Nandakumar in the Nampally court

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులైనా రామచంద్రభారతి, నందకుమార్‌లను బంజారాహిల్స్ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. బోగస్ ఆధార్, పాన్‌కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ కేసులో రామ చంద్ర భారతి, నందు కుమార్‌లను ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లిన పోలీసులు అనంతరం కోర్టులో హాజరుపర్చారు. దోమ మండలంలో సతీశ్ అనే వ్యక్తి భూమి వ్యవహారంలో బెదిరింపులు చేశారని ఫిర్యాదు మేరకు... నందకుమార్ మీద ఐపీసీ 386, 387 సెక్షన్ల కింద నమోదైన కేసులో అరెస్ట్ చేశారు.

నిన్న వీరద్దరికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈరోజు ఉదయమే విడుదల కాగా... పోలీసులు వారిని ఇతర కేసుల్లో అరెస్టు చేశారు. కారాగారం నుంచి తమ వస్తువులతో ఇద్దరూ బయటికి రాగా.. అప్పటికే గేటు వద్ద పోలీసులు కాపు కాశారు. నిందితులిద్దరూ గేటు దాటిన వెంటనే అప్పటికే సిద్ధంగా ఉన్న వాహనాల్లో ఇద్దరినీ ఎక్కించారు. ఇక ఇదే కేసులో సిట్ మెమో కొట్టివేత పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిసాయి. దీనిపై కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details