హైదరాబాద్ సివిల్ కోర్టులో తీన్మార్ మల్లన్న దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయస్థానం.. మల్లన్నకు వచ్చే నెల 9వరకు రిమాండ్ విధించింది.
Teenmar Mallanna: సెప్టెంబర్ 9 వరకు తీన్మార్ మల్లన్నకు రిమాండ్
తీన్మార్ మల్లన్న బెయిల్ పిటిషన్‌పై హైదరాబాద్ సివిల్ కోర్టులో వాదనలు ముగిశాయి. వచ్చే నెల 9వరకు మల్లన్నకు కోర్టు రిమాండ్ విధించింది.
బెదిరింపుల కేసులో నిన్న రాత్రి అరెస్టయిన తీన్మార్ మల్లన్నను హైదరాబాద్ చిలకలగూడ పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు. ఈ మేరకు మల్లన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని తనను బెదిరించాడని ఓ వ్యక్తి కొద్దిరోజుల క్రితం చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు ఠాణాకు పిలిపించి విచారణ జరిపారు. మరో కేసులో ఆయన కార్యాలయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు తనిఖీ చేశారు. సైబర్‌క్రైమ్ స్టేషన్‌లో రెండు, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్‌లో మల్లన్నపై ఒక్కో కేసు నమోదైంది. చిలకలగూడ కేసులో నిన్న రాత్రి ఆయనను అరెస్టు చేశారు.
ఇదీ చదవండి:REVANTH REDDY: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి నాంపల్లి కోర్టు సమన్లు