హైదరాబాద్ ఉప్పల్లో పోలీస్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. కర్మాన్ ఘాట్ శుభోదయ కాలనీకి చెందిన చందర్రావును పెట్రోలింగ్ వాహనం వేగంగా ఢీకొట్టింది. చందర్ మరణంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గురువారం ఉదయం ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రుడ్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయాలు కావడం వల్లే అతను మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని వ్యక్తి మృతి - చందర్ రావు మరణించారు
పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. హైదరాబాద్ ఉప్పల్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి