తమ డిమాండ్లు పూర్తి చేయాలంటూ హైదరాబాద్ పాతబస్తీ ఫలక్ నుమా ఆర్టీసీ డిపో ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా డిపో ముందు కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ధర్నాకు అనుమతి లేదంటూ.. సుమారు 50 మంది కార్మికులను ఫలక్ నుమా పోలీసులు అరెస్ట్ చేశారు.
పాతబస్తీలో కార్మికుల బస్ రోకో.. అడ్డుకున్న పోలీసులు - అడ్డుకున్న పోలీసులు
ఆర్టీసీ కార్మికుల బస్ రోకో అన్ని డిపోల వద్ద జరుగుతోంది. పాతబస్తీలో ఫలక్ నుమా, షారూఖ్ నగర్ డిపోల వద్ద ఆందోళనకు దిగిన కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
బస్సులు బయటకు రాకుండా డిపో ముందు కార్మికుల నిరసనలు
పాతబస్తీలోని ఫారూఖ్ నగర్ డిపో వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఆందోళన చేస్తున్న 40మంది కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇవీ చూడండి : బస్ రోకోకు అనుమతి లేదు: సీపీ
TAGGED:
అడ్డుకున్న పోలీసులు