తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రకృతి విపత్తులపై "పోలీసుల" మాక్ డ్రిల్ - Mock drill for natural disaster conducted in Kerala

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకోవల్సిన చర్యలపై శబరిమలైలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. స్థానిక ఓహోటల్​లో అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి చేరుకుని..  బాధితులను తాళ్ల సహాయంతో రక్షించారు.

Police mock drill on natural disasters
ప్రకృతి విపత్తులపై "పోలీసుల" మాక్ డ్రిల్

By

Published : Dec 14, 2019, 5:09 AM IST


అగ్నిప్రమాదాలు, విపత్తులు సంభవించినప్పుడు.. స్పందించాల్సిన తీరుపై శబరిమలైలో పోలీసులు మాక్ డ్రిల్ నిర్వహించారు. పంబా నది తీరంలోని ఓ హోటల్ లో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం అందిన రెండు నిమిషాల్లో అగ్నిమాపక వాహనాలు, అంబులెన్స్ లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. నిమిషాల వ్యవధిలోనే.. పై అంతస్తులో చిక్కుకున్న బాధితులను తాళ్ల సహాయంతో కిందికి దించి ఆసుపత్రికి తరలించారు.

ప్రకృతి విపత్తులపై "పోలీసుల" మాక్ డ్రిల్

రక్షణ చర్యలు - సవాళ్లు
అనంతరం అగ్నిమాపక సిబ్బంది భవనంలోకి చేరుకొని.. మూర్ఛ పోయిన వారిని తమ భుజాల మీద జాగ్రత్తగా అంబులెన్స్​లోకి తరలించారు. కేరళ పోలీస్, అగ్నిమాపక శాఖ, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంయుక్తంగా ఈ మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు రక్షణ చర్యలు చేపటేందుకు పట్టే సమయం.. సవాళ్లు తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు పంబా ప్రాంత భద్రతా పర్యవేక్షకులు నవనీత్ శర్మ వివరించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు స్పందించాల్సిన తీరుపై భక్తులకు, స్థానిక వ్యాపారులకు పలు సూచనలు చేశారు.

ఇవీ చూడండి: పౌరసత్వ చట్ట సవరణపై ఐరాస ఆందోళన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details