తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి

సమాజ క్షేమం కోసం ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారని హోంమంత్రి మహమూద్ అలీ గుర్తుచేశారు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్త గుర్తింపు వస్తోందన్న ఆయన.. కరోనా సమయంలోనూ వారు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నేరాల శాతం చాలా తక్కువగా ఉందని.. హైదరాబాద్​లో గత ఆరేళ్లుగా ఏ విధమైన మత ఘర్షణలు జరుగలేదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పండుగలు, ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.

పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి
పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి

By

Published : Oct 21, 2020, 10:57 AM IST

పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో పోలీస్‌ అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఆయన అమరులకు నివాళులర్పించారు.

పోలీసులకు, జవాన్లకు సమాజం ఎంతో రుణపడి ఉంది: హోంమంత్రి

సమాజ క్షేమం కోసం ఎందరో పోలీసులు ప్రాణత్యాగం చేశారని హోంమంత్రి గుర్తుచేశారు. తెలంగాణ పోలీసులకు దేశవ్యాప్త గుర్తింపు వస్తోందన్న ఆయన.. కరోనా సమయంలోనూ వారు అందించిన సేవలు మరవలేనివని కొనియాడారు. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో నేరాల శాతం చాలా తక్కువగా ఉందని.. హైదరాబాద్​లో గత ఆరేళ్లుగా ఏ విధమైన మత ఘర్షణలు జరుగలేదన్నారు. రాష్ట్ర ప్రజలందరూ పండుగలు, ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకుంటున్నారని పేర్కొన్నారు.

దేశ అంతర్గత భద్రతకు సవాలుగా మారిన ఉగ్రవాదం, తీవ్రవాదం, వ్యవస్తీకృత నేరస్తులను ఎదుర్కోవడంలో పోలీసులు నిరంతర కృషి చేస్తున్నారని డీజీపీ మహేదర్ రెడ్డి వెల్లడించారు. శాంతి, భద్రతల పరిరక్షణ కేవలం పోలీసులతోనే సాధ్యం కాదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్​ అమలు చేస్తున్నామని తెలిపారు. సీసీటీవి ఏర్పాటులో హైదరాబాద్ దేశంలోనే అగ్ర స్థానంలో ఉందన్నారు. విధుల్లో మరణించిన 264 మంది పేర్లను అదనపు సీపీ అనిల్ కుమార్ చదివి వినిపించారు.

ఇదీ చదవండి:అమరుల త్యాగాలను నిరంతరం స్మరించుకుంటాం: సీపీ

ABOUT THE AUTHOR

...view details