తెలంగాణ

telangana

ETV Bharat / state

కాంగ్రెస్‌ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్‌.. మామూలుగా కొట్టలేదుగా! - వికారాబాద్ కాంగ్రెస్ ధర్నా

Police Lati charge on Congress activists: కాంగ్రెస్‌ శ్రేణులపై పోలీసులు విరుచుకుపడ్డారు. కర్రలు విరిగేలా వారిపై లాఠీఛార్జ్‌ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ధర్నా ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే...

Police Lati charge on Congress activists in vikarabad
కాంగ్రెస్‌ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్‌.. మామూలుగా కొట్టలేదుగా!

By

Published : Dec 5, 2022, 9:51 PM IST

Police Lati charge on Congress activists: వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ధర్నా ఉద్రిక్తతకు దారి తీసింది. ధర్నా అనంతరం... జిల్లా కలెక్టర్‌ నిఖిలకు వినతి పత్రం ఇచ్చేందుకు పీసీసీ రేవంత్‌రెడ్డితో సహా కార్యకర్తలంతా ఒక్కసారిగా కలెక్టర్ ఆవరణలోకి రావడంతో.. వారిని పోలీసులు కట్టడి చేయలేకపోయారు. దీనితో కొంతమందిని లోపలికి పంపించగా.. మిగతా వారిని బయట నిలబెట్టారు.

అయినప్పటికీ వారు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీనితో పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. అరగంట పాటు.. కార్యాలయం ఆవరణం మొత్తం... కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆందోళనతో మారుమోగింది.

కాంగ్రెస్‌ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్‌.. మామూలుగా కొట్టలేదుగా!

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details