తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉద్యోగాల పేరుతో మోసం.. లక్షలు వసూలు చేసిన కానిస్టేబుల్​ - ఏపీ తాజా వార్తలు

Police Job Cheating :ఎవరైనా మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.. మరి ఆ పోలీసులే అన్యాయం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేస్తాం.. అలాంటి ఘటనే ఏపీ విజయవాడ కృష్ణలంకలో జరిగింది. హోంగార్డ్ ఉద్యోగాలిప్పిస్తానని ఓ కానిస్టేబుల్ పలువురి నుంచి లక్షల రూపాయల్లో నగదు వసూలు చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగాల పేరుతో మోసం.. లక్షలు వసూలు చేసిన కానిస్టేబుల్​
ఉద్యోగాల పేరుతో మోసం.. లక్షలు వసూలు చేసిన కానిస్టేబుల్​

By

Published : Nov 6, 2022, 10:26 PM IST

Police Job Cheating: ఎవరైనా మోసం చేస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.. కానీ పోలీసు సిబ్బందే అన్యాయం చేస్తే ఎవరికి ఫిర్యాదు చేస్తాం. ఇదే సంఘటన విజయవాడ కృష్ణలంకలో బాధితులకు ఎదురైంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్​గా విధులు నిర్వహిస్తున్న వెంకట సుబ్బారెడ్డి హోంగార్డ్ ఉద్యోగాలిప్పిస్తామని పలువురి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడని బాధితులు తెలిపారు. దీనిపై బాధితులు కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన ఖాదర్ వలి విజయవాడ వైఎస్సార్ కాలనీకి చెందిన శరత్ చంద్రల నుంచి 18 లక్షల రూపాయలను వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే కొన్నాళ్లుగా సుబ్బారెడ్డి విధులకు హాజరు కావట్లేదని అధికారులు చెబుతున్నారు.

నమ్మకంగా మాటలు చెప్పి డబ్బులు తీసుకున్నాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఎఫ్ఐఆర్​ను వన్ టౌన్​కు బదిలీ చేశారు. దీనిపై తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కష్టపడి సంపాదించి కూడబెట్టిన సొమ్మును.. ఉద్యోగం వస్తుందంటే నమ్మి ఇచ్చామని అంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details