తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఖాకీల' పాత్రపై ఆరా - జయరాం హత్యకేసు

సంచలనం కలిగించిన పారిశ్రామిక వేత్త జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. నిందితుడు రాకేష్​రెడ్డికి పోలీసులతో ఉన్న సంబంధాలపై విచారణ బృందం ఇవాళ విచారించనుంది.

పోలీసుల

By

Published : Feb 20, 2019, 6:14 AM IST

Updated : Feb 20, 2019, 10:40 AM IST

జయరాం హత్యకేసులో పోలీసుల విచారణ
పారిశ్రామికవేత్త, ప్రవాసభారతీయుడు జయరాం హత్య కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌రెడ్డిని పోలీసులు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ నుంచి నందిగామ తరలించారు. జయరాం మృతదేహంతో కారు వదిలిన ప్రాంతానికి చేరుకున్న విచారణ బృందం.. ఘటనా స్థలంలో హత్యపై సన్నివేశాన్ని రీ కన్​స్ట్రక్షన్​ చేశారు. రాకేష్​రెడ్డి మద్యం ఎక్కడ కొనుగోలు చేశాడు..? హత్యను రోడ్డు ప్రమాదంగా ఎలా చిత్రీకరించడానికి ప్రయత్నించాడన్న అంశాలపై పోలీసులు నిందితుడిని ప్రశ్నించారు. పథకం ప్రకారమే జయరాంను హత్య చేసినట్టు నిర్ధరణకు వచ్చారు.
పోలీసులతో ఉన్నసంబంధాలపై ఆరా
ఈ కేసులో రాకేష్​రెడ్డితో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్​స్పెక్టర్​ శ్రీనివాస్​, ఏసీపీ మల్లారెడ్డిలను దర్యాప్తు అధికారులు ఇవాళ విచారించే అవకాశం ఉంది.
Last Updated : Feb 20, 2019, 10:40 AM IST

ABOUT THE AUTHOR

...view details