తెలంగాణ

telangana

ETV Bharat / state

తెల్లవారుజాము ప్రయాణాలు తగ్గించుకోవాలి: సైబరాబాద్​ పోలీసులు - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

రాష్ట్రంలో తెల్లవారుజామున పొగ మంచు కురుస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సైబరాబాద్​ పోలీసులు తెలిపారు. వాహనదారులకు పలు సూచనలు చేశారు.

police instructions on vehicles journey in early morning
తెల్లవారుజాము ప్రయాణాలు తగ్గించుకోవాలి: పోలీసులు

By

Published : Dec 27, 2020, 12:34 PM IST

పొగమంచు దృష్ట్యా వాహనదారులకు సైబరాబాద్​ పోలీసులు పలు సూచనలు చేశారు. తెల్లవారుజామున ప్రయాణాలు తగ్గించుకోవాలని కోరారు. ఎక్కువ వెలుతురు ఉన్న హెడ్‌లైట్స్ వల్ల ఎదురుగా వచ్చే వాహనదారుడికి ఇబ్బందులు తలెత్తుతాయని చెప్పారు.

రాత్రి, తెల్లవారుజామున వాహనం వైపర్లు ఉపయోగించాలన్నారు. బ్రేక్ వేసే ముందు వెనుక నుంచి వచ్చే వాహనాలు చూసుకోవాలని సూచించారు. హైవేలపై వాహనాలు నిలపొద్దని.. వాహనంలో పెద్ద శబ్దంతో పాటలు పెట్టుకోవద్దని చెప్పారు. పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు హారన్ కొడుతూ వెళ్లాలని తెలిపారు.

ఇదీ చదవండి:బలవన్మరణం: ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులోకి దూకిన తల్లి

ABOUT THE AUTHOR

...view details