Newer celebrations in Hyderabad: భాగ్యనగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్దం అవుతోంది. ఈ సారి మరింత ఘనంగా కొత్త సంవంత్సరానికి స్వాగతం పలికేందుకు నగరవాసులు వేచిచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రత్యేంగా వేడుకలు నిర్వహించే నిర్వాహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పలు నిబంధలను విధించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో వేడుకలను రాత్రి ఒంటి గంట వరకూ నిర్వహించుకునేందుకు త్రీస్టార్ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు 10 రోజల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపగా ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయింది.
వేడుకలు ప్రాంగణంలో ఎంట్రీ, ఎక్జిట్ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లోనూ సీసీటీవీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. ట్రాఫిక్ క్లియరెన్స్‌కు సెక్యూరిటి గార్డులను నియమించుకోవాలని సూచించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చూడాలని.. వేడుకల ప్రాంగణంలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని ఆదేశించారు. ఎంటువంటి మారణాయుధాలను వేడుకల ప్రాంతాల్లోకి అనుమతించకూడదని సూచించారు. ఇందుకు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు.
మైనర్లకు నో పర్మిషన్: నిర్ధిష్ట పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికంగా వేడుక ప్రాంగణానికి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. నిర్వహకులు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని.. సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు. జంటలకు కోసం పబ్బులు, బార్లలో నిర్వహించే వేడుకలకు మైనర్లను అనుమతించకూడదన్నారు.