ప్రవాస భారతీయుడు, పారిశ్రామిక వేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఏసీపీ మల్లారెడ్డిలను దర్యాప్తు అధికారులు విచారించారు. నిందితుడు రాకేష్ రెడ్డితో వీరికి గల సంబంధాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పోలీసుల పాత్రపై ఆరా - జయరాం హత్య కేసు
సంచలనం కలిగించిన జయరాం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను దర్యాప్తు అధికారులు విచారించారు.

పోలీసుల పాత్ర
జయరాం హత్య కేసులో పోలీసుల పాత్రపై ఆరా
జయరాం హత్య గురించి తమకు ఏమీ చెప్పలేదని, స్నేహితుడితో గొడవ జరిగిందని మాత్రమే చెప్పాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు విచారణలో వెల్లడించారు. తగాదాపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు వివరించారు. దీనిపై దర్యాప్తు అధికారులు ఆధారాలు సేకరిస్తున్నారు.