తెలంగాణ

telangana

ETV Bharat / state

Police Implementation Election Code Strictly in Telangana : ఎక్కడికక్కడ తనిఖీలు, సోదాలు.. ఎలక్షన్​ కోడ్​తో పోలీసుల రెడ్ అలెర్ట్ - తెలంగాణ తాజా వార్తలు

Police Implementation Election Code Strictly in Telangana : అసెంబ్లీ ఎన్నికల్లో ప్రలోభాలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలన్న.. కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు.. అధికార యంత్రాంగం రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు నిర్వహిస్తోంది. వాహనాల తనిఖీల్లో ఎక్కువగా నగదుతో పాటు బంగారం, మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు.

Huge Money Gold Seized in Telangana
Police Implementation Election Code Strictly

By ETV Bharat Telangana Team

Published : Oct 12, 2023, 8:27 PM IST

రాష్ట్రంలో ఎన్నికల కోడ్ జోరుకు పోలీసుల ముమ్మర తనిఖీలు

Police Implementation Election Code Strictly in Telangana : రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూలు విడుదలతో కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేసేలా పటిష్ఠ చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించకుండా అధికార యంత్రాగం.. విస్త్రృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ధిక్కరిస్తే కఠిన చర్యలను అవలంభిస్తోంది. పోలీస్ యంత్రాంగం పూర్తి స్థాయిలో వాహనాల తనిఖీలు చేస్తూ అక్రమంగా తరలించే మద్యం, డబ్బు, బంగారం వంటి వాటిపై ఉక్కుపాదం మోపుతుంది.

ప్రతిరోజు రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తూ భారీ మొత్తంలో అక్రమ నగదును స్వాధీనపరుచుకున్నారు. అనేక ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి సోదాలు చేస్తున్నారు. వాహనాల తనిఖీల్లో ప్రతిరోజు లక్షల కొద్దీ నగదు, మద్యం బాటిళ్లు బయటపడుతున్నాయి. మెదక్ జిల్లాలోని చెర్లపల్లి వద్ద రూ.12 లక్షలు, పెద్దశంకరంపేట చెక్‌పోస్టు వద్ద రూ.5 లక్షలు, మంబోజిపల్లి వద్ద లక్షా19 వేలు రూపాయలు, అక్కన్నపేట వద్ద లక్ష రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

How to Register to Vote Telangana : ఓటు హక్కే మీ వజ్రాయుధం.. ఈ హక్కును వదులుకోవద్దు

Huge Money Gold Seized in Telangana : చేగుంట మండలంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న.. ఇబ్రహీంపూర్‌కి చెందిన మెుయ్య రాజయ్య దగ్గర రూ.70 వేలు విలువైన మద్యం సీసాలను సీజ్‌చేశారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ బస్టాండ్ వద్ద స్కూటీలో తరలిస్తున్న తొమ్మిది లక్షల రూపాయలను పట్టుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రమంతటా ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు.. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్‌ ఎస్​ఆర్ నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వాహనాల తనిఖీల్లో.. ఎలాంటి ధువపత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న తొమ్మిది లక్షల 90 వేల రూపాయలను పోలీసులు జప్తు చేశారు. వికారాబాద్ తాండూరు తనిఖీల్లో.. రూ.6 లక్షల నగదును పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ మహంకాళి వద్ద తనిఖీల్లో.. సరైన రసీదులు లేకుండా తీసుకెళ్తుండగా 29 లక్షల విలువైన 55 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

Police Implementation Election Code Strictly :ఎన్నికలు ముగిసే వరకు ప్రతి రోజు పెద్ద ఎత్తున వాహనాల తనిఖీలు కొనసాగుతాయన్న పోలీసులు.. సరైన పత్రాలు చూపి నగదు, బంగారంతో పాటు ఇతరత్రా వస్తువులు తీసుకెళ్లవచ్చని స్పష్టం చేశారు. వాటికి సంబంధించి సరైన వివరణ ఇవ్వాలని ఎన్నికల విభాగ అధికారులు స్పష్టం చేస్తున్నారు. రూ.50 వేలు దాటితే ఆధారాలు తప్పనిసరి.

సెల్ఫ్‌ చెక్‌ ద్వారా అయితే, ఆ చెక్‌ జిరాక్స్ కాపీ, ఏటీఎం ద్వారా తీసుకుంటే మిషన్‌ ద్వారా వచ్చిన స్లిప్‌ పేపర్, డబ్బులు విత్‌డ్రా చేస్తే బ్యాంకు అధికారి ఇచ్చిన ఓచర్‌ స్లిప్పును వెంట ఉంచుకోవాలి. అదేవిధంగా బ్యాంకులో డిపాజిట్‌ చేయడానికి తీసుకెళ్తున్నట్లుగా వ్యక్తిగత డిక్లరేషన్‌, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్స్ కాపీ ఉండాలి. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరారు. నింబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

GHMC Commissioner on Election Review : ఎన్నికలు సజావుగా సాగేందుకు.. పార్టీలు సహకరించాలి : రొనాల్డ్ రోస్

ABOUT THE AUTHOR

...view details