తెలంగాణ

telangana

ETV Bharat / state

Police Implement Election Code in Telangana : రసీదు ఉంటేనే రక్షణ! ఎన్నికల కోడ్​ వేళ తనిఖీలతో జాగ్రత్త.. ఈ పత్రాలు మర్చిపోకండి

Police Implement Election Code in Telangana : రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో అధికారగణం అప్రమత్తమైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుకు పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయపరమైన రాతలు, నాయకుల ఫ్లెక్సీలను తొలగించిన అధికారులు.. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో భారీగా హవాలా సొమ్ము, అక్రమ మద్యం, బంగారాన్ని స్వాధీం చేసుకున్నారు.

Police Implement Election Code In Telangana
Police Implement Election Code In Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 11, 2023, 7:27 AM IST

Updated : Oct 11, 2023, 7:46 AM IST

Police Implement Election Code in Telangana :రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో.. పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలపై రాజకీయ పరమైన రాతలు కనబడకుండా తెల్ల సున్నం వేయించారు. రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు తొడిగారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ మోహరించిన పోలీసులు.. ప్రతి వాహనాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లో అనుమానాస్పదంగా ఉన్న కియా కారును తనిఖీ చేసిన పోలీసులు.. రూ.3 కోట్ల 35 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం హవాలా సొమ్ముగా తేలడంతో.. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. సనత్‌నగర్‌లో సరైన రసీదులు లేకుండా స్కూటీలో తరలిస్తున్న రూ.15 లక్షల 40 వేలను పట్టుకున్నారు. ఎస్సార్‌నగర్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి వద్ద రూ.15 లక్షలు.. ఆసిఫ్‌నగర్‌లో బైక్‌పై వెళ్తున్న మరో వ్యక్తి వద్ద రూ.6 లక్షలు.. దోమలగూడలో రూ.6 లక్షలను జప్తు చేశారు.

Implementation of Election Code in Telangana : రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలు.. పోలీసుల తనిఖీలు షురూ

Police Implement Election Code In Telangana : ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపట్టారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన తనిఖీల్లో రూ.55 లక్షల 50 వేలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుముల మండలంలో.. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి వద్ద.. రసీదులు లేని రూ.30 లక్షలు, వేరొక బస్సులో మరో ప్రయాణికుడి వద్ద రూ.99 వేల 500ల నగదును జప్తు చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్వహించిన తనిఖీల్లో ఖానాపురం నుంచి వస్తున్న ఓ కారులో రూ.లక్షా 12 వేలను సీజ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వాహనాల తనిఖీల్లో ఎలాంటి ఆధారాలు లేని.. రూ.లక్షా యాభై వేలను పట్టుకున్నారు.

Implementation of Election Code in Telangana: ఎన్నికల కోడ్ నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రభుత్వ కార్యాలయాలకు అతికించిన పోస్టర్లను తొలగించారు. రాజకీయాలతో సంబంధమున్న నాయకుల విగ్రహాలకు ముసుగులు వేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వరంగల్‌లో వివిధ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలను బల్దియా డిజాస్టర్ సిబ్బంది తొలగించారు. కొన్నిచోట్ల ఫ్లెక్సీలతో పాటు గోడ పత్రికలకు తెలుపు రంగును వేశారు.

ప్రధాన కూడళ్లలో మహనీయుల విగ్రహాలకు ముసుగులను తొడిగారు. ఎన్నికల అనంతరం వాటిని తొలగిస్తామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో వివిధ పార్టీల ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు. రాజకీయ నాయకుల విగ్రహాలు కనపించకుండా వస్త్రాలతో మూసివేశారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలంతా సహకరించాలని అధికారులు కోరారు. నింబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

వీటిని వెంట ఉంచుకోండి..

  • మీరు ఒకవేళ రూ.50 వేల కంటే ఎక్కువ నగదును వెంటతీసుకెళ్తే.. ఆ డబ్బును డ్రా చేసిన రసీదు లేదా సంక్షిప్త సందేశం.
  • ఆసుపత్రుల్లో బిల్లులు చెల్లించేందుకు డబ్బు తీసుకెళ్తే.. ఇన్​పేషెంట్​ వివరాలు, సంబంధిత రిపోర్టులు
  • కార్మికులు, కూలీలు, ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు నగదు తీసుకెళ్తే డ్రా చేసిన ఖాతా వివరాలు, సిబ్బంది జాబితా
  • బంగారు ఆభరణాలు, వస్తువులు పెద్ద ఎత్తున తీసుకెళ్తుంటే వాటి ఆర్డర్​ పత్రాలు, రసీదులు
  • భూ లావాదేవీల విషయంలో నగదు తీసుకెళ్తున్నట్లైతే సంబంధింత దస్తావేజులు, మీ సేవా కేంద్రాల్లో నమోదు చేసుకున్న స్లాట్ పత్రాలు
    Police Implement Election Code in Telangana : రసీదు ఉంటేనే రక్షణ..! ఎన్నికల కోడ్​ వేళ తనిఖీలతో జాగ్రత్త

GHMC Commissioner on Telangana Election 2023 : అసెంబ్లీ పోరుకు 'గ్రేటర్' రెడీ.. వారిపై స్పెషల్ ఫోకస్

How to Carry Money when Election Code : రూ.50వేలు కంటే ఎక్కువ తీసుకెళ్తే.. తప్పనిసరిగా ఈ రూల్స్ తెలుసుకోవాల్సిందే...

Last Updated : Oct 11, 2023, 7:46 AM IST

ABOUT THE AUTHOR

...view details