తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల ఔదార్యం.. నిండు గర్భిణీకి సాయం - నిండు గర్భిణీ పోలీసుల సాయం

లాక్‌డౌన్ కొనసాగుతున్న తరుణంలో చిలకలగూడ పోలీసులు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ నిండు గర్భిణీని సకాలంలో ఆసుపత్రికి తరలించి... ఆమె ప్రాణాలు కాపాడారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని మరోసారి నిరూపించారు.

పోలీసుల ఔదార్యం... నిండు గర్భిణీకి సాయం
పోలీసుల ఔదార్యం... నిండు గర్భిణీకి సాయం

By

Published : Apr 18, 2020, 10:29 AM IST

హైదరాబాద్‌‌ వారాసిగూడకు చెందిన ఆనంద్, నవీనలు దంపతులు. నవీనకు పురుటినొప్పులు రాగా ఆమె భర్త 100 నంబర్‌కి ఫోన్‌ చేశాడు. తక్షణమే స్పందించిన పెట్రోలింగ్‌ సిబ్బంది సతీశ్‌, కానిస్టేబుళ్లు ప్రకాష్, సాయిలింగ, మజార్‌లు వెంటనే వారి ఇంటికి చేరుకుని ఆమెను పెట్రోలింగ్‌ కారులో ఆస్పత్రికి తరలించారు. తొలుత 108 సిబ్బందిని సంప్రదించినప్పటికీ... వారు రాలేదని ఆనంద్‌ తెలిపారు. పోలీసులకు సమాచారమిస్తే వారు వచ్చి తన భార్యను కోఠిలోని ప్రసూతి ఆసుపత్రికి తరలించారని ఆయన చెప్పారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details