సామాజిక మాధ్యమంలో వైకాపా ఎంపీ మార్గాని భరత్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన ఉండవల్లి అనూష అనే యువతికి పోలీసులు నోటీసులు పంపారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల విషయంలో ఎంపీ మార్గాని భరత్‌ను సోషల్ మీడియా వేదికగా యువతి ప్రశ్నించింది. ఈ వీడియోలపై రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలోని బొమ్మూరు పోలీసుస్టేషన్లో స్థానిక వైకాపా నాయకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనూషకు నోటీసులు జారీ చేశారు. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. సైబర్ నేరం 41(a) సెక్షన్ కింద యువతికి నోటీసులు అందించారు.
వైకాపా ఎంపీపై పోస్టులు పెట్టిన యువతికి నోటీసులు - case bookes on undavalli anusha news
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌పై సామాజిక మాధ్యమాల్లో ఆరోపణలు చేసిన ఉండవల్లి అనూష అనే యువతిపై పోలీసు కేసు నమోదైంది. మూడు రోజుల్లో విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.
వైకాపా ఎంపీ భరత్‌పై పోస్టులు... చేసిన వారికి నోటీసులు
TAGGED:
ఉండవల్లి అనూష వార్తలు