బాలాపూర్ పోలీస్టేషన్ పరిధిలో కలకలం రేపిన ఏడేళ్ల బాలుడి హత్య కేసును పోలీసుల చేధించారు. హైదరాబాద్‌లోని పహాడిషరీఫ్ ముస్తఫానగర్‌లో ఈనెల 8న రాత్రి ఇంటి నుంచి షాపుకు వెళ్తుతున్న ఏడేళ్ల మహ్మద్ యాసిన్‌కు మాయమాటలు చెప్పిన ఒమర్..పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్ళాడు. బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన ఒమర్..యాసిన్ ప్రతి ఘటించగా బండరాయితో తలపై, పొట్టపై మోది కిరాచకంగా హత్య చేశాడు.
బాలుడి అలికిడి విని స్థానికులు కేకలు వేయగా ఒమర్ అక్కడినుంచి పరారయ్యాడు. అప్పటికే బాలుడు మృతి చెందాడు. బస్తీ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి చెప్పులు, సీసీటీవీ ఫుటేజ్, కాలనీ వాసులు ఇచ్చిన సమాచారం ఆధారంగా హుడా కాలనీకి చెందిన నిందితుడు ఒమర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఏడేళ్ల బాలుడి హత్యకేసును చేధించిన పోలీసులు... - MUHAMMAD YASIN
హైదరాబాద్ పహాడి షరీఫ్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల బాలుడు మహ్మద్ యాసిన్ హత్యకేసును పోలీసులు చేధించారు. ఎట్టకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఎట్టకేలకు కిరాతకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఇవీ చూడండి : 'అర్హత పరీక్షల్లో ఎలాంటి రిజర్వేషన్లు ఉండవు'