డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడన్న పక్కా సమాచారంతో ముంబైకి చెందిన షాబాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ఆరు గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, చరవాణి స్వాధీనం చేసుకున్నారు. షాబాజ్ గతంలో ఈవెంట్ ఆర్గనైజర్‌గా పనిచేశాడు. రాజేంద్రనగర్‌లో నివాసముంటూ ముంబై నుంచి డ్రగ్స్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడిని లంగర్ హౌస్ పోలీసులకు అప్పగించారు.
లంగర్‌హౌస్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్ - Police have arrested a man who supplied drugs in the Langer House
హైదరాబాద్ లంగర్‌హౌస్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఆరు గ్రాముల కొకైన్, నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్, చరవాణి స్వాధీనం చేసుకున్నారు.
లంగర్‌హౌస్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్