శాంతిభద్రతల దృష్ట్యా రానున్న పండుగ రోజులను దృష్టిలో ఉంచుకుని బేగంపేట పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. హనుమాన్ జయంతి, శ్రీరామనవమి పండుగల దృష్ట్యా ప్రజల్లో ఉన్న అభద్రతా భావాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు పోలీసుల కవాతు - ts police
హైదరాబాద్ బేగంపేట పీఎస్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించేందుకు పోలీసుల కవాతు
ఫ్లాగ్మార్చ్లో నార్త్ జోన్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్, బేగంపేట ఏసీపీ నరేశ్ కుమార్, బేగంపేట ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, తదితర పోలీసులు పాల్గొన్నారు. పోలీసులు పెద్ద ఎత్తున కవాతుగా కదిలి ప్రజల్లో అభద్రతా భావాన్ని తొలగించే విధంగా అవగాహన కల్పించారు. శాంతి భద్రతపరమైన అంశాలు ఉంటే పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ఇవీ చూడండి:'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'