పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని... జంగంమేట్ డివిజన్లో ఉన్న సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. దక్షిణ మండల డీసీపీ గజరావు భూపాల్ ఆదేశాల మేరుకు... ఏసీపీ మాజిద్ నేతృత్వంలో... ఛత్రినాక పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు డీసీపీ తెలిపారు.
పాతబస్తీలో పోలీసుల కవాతు.. అందుకేనట!
ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి... అక్కడి ప్రజలకు భరోసా కల్పించేందుకు పోలీసుల కవాతు నిర్వంచినట్లు దక్షిణ మండల డీసీపీ గజరావు భూపాల్ తెలిపారు. అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంటుందని వెల్లడించారు.
'ప్రజలకు భరోసా కల్పించేందుకే కవాతు నిర్వహించాం'
కవాతులో దక్షిణ మండలం డీసీపీ, ఫలక్నూమ ఏసీపీ, ఛత్రినాక సీఐ, అదనపు బలగాలు పాల్గొన్నాయి. ఎన్నికల్లో భాగంగా సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రజలకు భరోసా కల్పించడానికి కవాతు నిర్వహించామని డీసీపీ తెలిపారు. అన్ని సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఉంచినట్లు తెలిపారు.
ఇదీ చూడండి:మీసేవ సెంటర్ల వద్ద పోలీసుల భద్రతా చర్యలు