తెలంగాణ

telangana

ETV Bharat / state

మాస్క్ లేకుండా బయటకు వస్తే.. జరిమానా కొరడా!

కరోనా మనకు సోకదులే అని ఒకరు... నేను మాస్కు వేసుకోకపోతే నష్టం లేదని మరొకరు.. ఇలా ఎవరికి ఎవరు నాకు కరోనా రాదు అనే భ్రమతో మాస్కుల్లేకుండా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. మరి కొందరైతే మాస్కు మెడకు వేసుకొని... అలంకారప్రాయంగా ఉంచుకుంటున్నారు. ఇటువంటి వారిపై ఏపీలోని కడప పోలీసులు జరిమానా కొరడా ఝుళిపించారు.

police-fines-on-those-who-are-not-wearing-masks-in-kadapa
మాస్క్ లేకుండా బయటకు వస్తే.. జరిమానా కొరడా!

By

Published : Jun 16, 2020, 12:34 PM IST

ఏపీలోని కడపలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్నా... కొంతమంది బాధ్యతారాహిత్యంగా మాస్కులు ధరించటం లేదు. అలాంటి వారిపై పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటోంది. జిల్లాలో అన్ని పోలీసు స్టేషన్​ల పరిధిలో మాస్కు లేకుండా రహదారులపైకి వచ్చిన వారికి జరిమానాలు విధిస్తున్నారు. సుమారు సోమవారం ఒక్కరోజే 494 కేసులు నమోదు చేసి... రూ. 1,08,620 జరిమానా విధించినట్లు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ వెల్లడించారు.

కరోనా వైరస్ నియంత్రణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని అన్బురాజన్ విజ్ఞప్తి చేశారు. ప్రజలంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. కొంతమంది అలంకార ప్రాయంగా మాస్కును వాడుతున్నారనీ... అది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమేనని హెచ్చరించారు.

'మీ ఆరోగ్య మీ చేతుల్లోనే ఉంది. తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కచ్చితంగా భౌతిక దూరం పాటించాలి. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం' - ఎస్పీ అన్బురాజన్

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి:కొండపై గుహలో పిల్లలు.. శ్రమించి రక్షించిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details