తెలంగాణ

telangana

By

Published : Jul 25, 2020, 3:05 PM IST

ETV Bharat / state

హోమ్‌ గార్డ్‌ కుటుంబానికి పోలీసుల ఆర్థిక సాయం

విధి నిర్వహణలో కరోనాతో పోరాడి ఇటీవల మరణించారు ఓ హోమ్ గార్డ్. అతని కుటుంబాన్ని పోలీసులు ఆదుకున్నారు. వారికి రూ. 1.35 లక్షల నగదు అందజేశారు. రామకృష్ణ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని ట్రాఫిక్‌ డీసీపీ చౌహన్ హామీ ఇచ్చారు.

హోమ్‌ గార్డ్‌ కుటుంబానికి పోలీసుల ఆర్థిక సాయం
హోమ్‌ గార్డ్‌ కుటుంబానికి పోలీసుల ఆర్థిక సాయం

హైదరాబాద్‌ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్‌లో పని చేస్తున్న హోమ్ గార్డ్ రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూన్ 25న మృతి చెందారు. ఆ హోమ్ గార్డ్ కుటుంబానికి సైఫాబాద్ ట్రాఫిక్ పోలీసులతో పాటు... ట్రాఫిక్ డీసీపీ చౌహన్ కలిసి రూ. 1.35 లక్షల నగదును అందజేశారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని డీసీపీ చౌహన్ వారికి హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details