Boyaguda Incident: సికింద్రాబాద్ బోయగూడలోని తుక్కు గోదాంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ప్రమాదంలో 11 మంది సజీవ దహనం కావడంతో... ప్రమాదానికి దారి తీసిన కారణాలను క్షణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటికే క్లూస్ టీం, ఫోరెన్సిక్ అధికారులు ఘటనా స్థలంలో నమూనాలు సేకరించారు. మొదట మంటలంటుకొని.. ఆ తర్వాత సిలిండర్ పేలడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లుగా పోలీసులు ఇప్పటికే నిర్థారణకు వచ్చారు. అయితే మంటలు ఎలా వ్యాపించాయనే విషయాలను తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నారు. విద్యుతాఘాతమా లేకపోతే ఇంకేదైనా కారణమా అనే కోణంలోనూ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తుక్కు గోదాంలో అట్ట ముక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు మద్యం సీసాలున్నాయి. ఇవన్నీ నెమ్మదిగా లోలోపల అంటుకొని ఆ తర్వాత ఒక్కసారి దావానంలా వ్యాపించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే మంటల దాటికి సిలిండర్ పేలినట్లు అనుమానిస్తున్నారు. ప్రమాదాన్ని పసిగట్టిన పరేమ్ అనే కార్మికుడు కిటికీలో నుంచి కిందికి దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పరేమ్ నుంచి పోలీసులు ఇప్పటికే సమాచారం సేకరించారు. ప్రమాదం రోజు రాత్రి ఒక గదిలో ముగ్గురు, మరో గదిలో 9మంది నిద్రపోయినట్లు పరేమ్ పోలీసులకు తెలిపారు. సిలిండర్ పేలుడుతో మెలకువ వచ్చి చూడగా మొత్తం పొగ కమ్ముకొని మంటలు వ్యాపించాయని... కిందికి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు పరేమ్ పోలీసులకు వివరించారు.
పరిశీలించిన హెచ్‌ఆర్సీ ఛైర్మన్ చంద్రయ్య