కరోనా నియంత్రణ కోసం పోలీస్ యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. ఓవైపు నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే.. మరోవైపు కరోనాపై వివిధ రూపాల్లో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఖైరతాబాద్ ప్రధాన చౌరస్తా వద్ద భారీ కరోనా పెయింటింగ్‌తో ప్రజలను చైతన్యపరుస్తున్నారు. కరోనాను జయించాలంటే ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని.. ప్రభుత్వ నియమాలతో పాటు లాక్‌డౌన్ నిబంధనలు తప్పక పాటించాలని సూచిస్తున్నారు.
భారీ కరోనా పెయింటింగ్‌తో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు - awareness with corona painting
కరోనా నియంత్రణకు లాక్‌డౌన్ అమలులో కఠినంగా వ్యవహరిస్తున్న పోలీసులు.. ప్రజలకు అవగాహన కల్పించడంలోనూ ముందుంటున్నారు. హైదరాబాద్‌లో ఖైరతాబాద్ ప్రధాన చౌరస్తా వద్ద భారీ కరోనా పెయింటింగ్‌తో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. వైరస్‌ను జయించాలంటే ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం కావాలని సందేశమిస్తున్నారు.

కరోనా పెయింటింగ్