తలసేమియా బాధితుల సహాయార్థం హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ, బాచుపల్లి పోలీసులు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. మాదాపూర్ జోన్ పరిధిలోని పీఎస్‌లలో ఇప్పటివరకు 534 మంది రక్తదానం చేశారని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.
Blood donation: రక్తదానం చేసిన పోలీసులు - bachupalli PS
హైదరాబాద్ కేపీహెచ్‌బీ పీఎస్ పరిధిలో పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు. తలసేమియా బాధితులకు రక్తం లభించక ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతోనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. రక్తదానానికి యువత పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
blood donation camp
కరోనా మహమ్మారి వల్ల రక్తదానం చేయడానికి ఎవరూ ముందుకు రావటం లేదన్నారు వెంకటేశ్వర్లు. యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని విజ్ఞప్తి చేశారు. మరొకరి ప్రాణాలు కాపాడినవారవుతారని వివరించారు. సైబరాబాద్ కమిషనర్ సూచనలతో రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.
ఇదీ చదవండి:TALASANI: ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలిపెట్టేదే లేదు: తలసాని