Decade Celebrations in Telangana 2023 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లో పోలీస్ శాఖ సురక్ష దినోత్సవం పేరిట పలు కార్యక్రమాలు నిర్వహించనుంది. ఉదయం 9 గంటలకు ట్యాంక్ బండ్ మీద పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు.. బ్లూ కోల్ట్స్ ర్యాలీ చేస్తారు. ట్యాంక్ బండ్ మీదగా లిబర్టీ, అబిడ్స్, మోజంజాహి మార్కెట్, రవీంద్ర భారతి, ఇక్బాల్ మినార్, బీఆర్ అంబేడ్కర్ సచివాలయం.. ఇందిరాగాంధీ విగ్రహం, నెక్లెస్ రోడ్డు మీదగా సంజీవయ్య పార్క్‌కు చేరుకొని ర్యాలీ ముగుస్తుంది.
Suraksha Day in Telangana Today : సాయంత్రం 4 గంటలకు సచివాలయం, బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద.. సాంకేతిక ప్రదర్శన, వీనుల విందైన పోలీస్ బ్యాండ్, జాగిలాల ప్రదర్శన, ఫోరెన్సిక్ విభాగంతో ఫొటో ప్రదర్శన జరగనుంది. వేలిముద్రల విభాగం, బాంబు డిస్పోజబుల్ సిబ్బంది డ్రిల్.. కమ్యూనికేషన్ విభాగం పరికరాల ప్రదర్శన, అగ్నిమాపక శాఖ మాక్‌డ్రిల్ నిర్వహణతో పాటు.. జైళ్ల శాఖ స్టాళ్లు ఏర్పాటు చేస్తారు. పోలీసులు, మైత్రి కమిటీ సభ్యులు కలిసి పెద్ద ఎత్తున రూట్ మార్చ్ నిర్వహించనున్నారు.
21 Days Decade celebrations in Telangana : బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నుంచి ప్రారంభం కానున్న రూట్‌మార్చ్.. రోడ్డు నెంబర్ 12 మీదుగా, ఫిలింనగర్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్టీఆర్ భవన్, క్యాన్సర్ ఆసుపత్రి.. బీఆర్‌ఎస్ భవన్ మీదుగా తిరిగి కమాండ్ కంట్రోల్ కేంద్రానికి చేరుకుంటుంది. ఆ ర్యాలీలో దాదాపు 1000 మంది పోలీసులు పాల్గొననున్నారు. ర్యాలీ దృష్ట్యా పోలీసులు ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.