Police Couple Pre Wedding Shoot in Hyderabad :ఈ మధ్య కాలంలో పెళ్లికి ముందు నూతన వధూవరులుగా కాబోయేవారు ఫ్రీ వెడ్డింగ్ షూట్(Pre-wedding Shoot)లు చేయడం ఫ్యాషన్‌గా మారిపోయింది. అందుకోసం వారు వివిధ ప్రాంతాలకు వెళుతూ.. విభిన్న రీతుల్లో ఫొటోలు, వీడియోలకు ఫోజ్‌లు ఇస్తుంటారు. అందులో జీవిత భాగస్వామితో కలిసి ఉన్న ఓ మంచి వీడియోను షూట్ చేసి.. దానినే ఆహ్వానంగా మిత్రులకు, బంధువులకు షేర్ చేస్తుంటారు.
ఇంకా ఆ షూట్‌నే పదిరోజుల నుంచి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, పేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తారు. అయితే ఓ నూతన జంట మాత్రం వినూత్నంగా ఆలోచిస్తూ.. తమ వృత్తిని అందులో చూపించాలనే భావంతో ప్రీ వెడ్డింగ్ షూట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు విమర్శలు చేస్తే.. మరికొంత మంది వారిని మెచ్చుకుంటున్నారు. అదే తెలంగాణ పోలీసు జంట(Telangana Police Couple Wedding Shoot) చేసిన షూట్.
76 వెడ్స్ 46.. లేటు వయసులో ఘాటు ప్రేమ.. ఆలయంలో పెళ్లి
Police Couple Organized Pre-wedding Shoot in Police Dress : త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న తెలంగాణ పోలీసు జంట ప్రీ వెడ్డింగ్ షూట్ చేశారు. వారిద్దరూ పోలీసు అధికారులే కావడంతో ఆ అంశాన్ని ప్రతిబించేలా షూట్లో పాల్గొన్నారు. పెళ్లికి ఆహ్వానం పంపుతూ బంధు, మిత్రులకు షేర్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలోకి వెళ్లడంతో ట్రెండ్ అయి మిశ్రమ స్పందన వచ్చింది. దీనిపై కొంత మంది పోలీస్ యూనిఫామ్‌ను సొంత అవసరాలకు వాడుకుంటారా అంటూ విమర్శిస్తే.. మరికొంత మంది మాత్రం సపోర్టు చేశారు. ఈ విషయంపై తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(CV Anand) తన ఎక్స్(Twitter) వేదికగా స్పందించారు.