Car Fire At Assembly: అసెంబ్లీ గేట్-1 వద్ద అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తుండగా కారులో నుంచి ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఇంజిన్ నుంచి దట్టమైన పొగలు రావడంతో.. అప్రమత్తమైన కారు యజమాని వెంటనే వాహనంలో నుంచి దిగిపోయారు.
అసెంబ్లీ ముందు మంటలు.. అప్రమత్తమైన పోలీసులు.. ఏమైందంటే.. - car fire at assembly
Car Fire At Assembly: అసెంబ్లీ గేటు వద్ద అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డుపై వెళ్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో... అక్కడే విధులు నిర్వహిస్తున్న అగ్నిమాపక, పోలీసు సిబ్బంది అప్రమత్తమై మంటలను ఆర్పివేశారు.
అసెంబ్లీ వద్ద కారులో మంటలు
అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు.. అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంచారు. ప్రమాదాన్ని గమనించిన అగ్నిమాపక సిబ్బంది.. కారులో మంటలు అదుపు చేశారు. ఫైర్ఇంజిన్ అందుబాటులో ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. వాహనం కూడా పూర్తిగా కాలిపోకుండా చూడగాలిగారు. ఘటనతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఇదీ చదవండి:Field Assistants Arrested : అసెంబ్లీ ముట్టడికి యత్నించిన ఫీల్డ్ అసిస్టెంట్లు అరెస్టు