కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 300 మందికి నేర చరిత్ర - కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 300 మందికి నేర చరిత్ర
09:34 January 14
కానిస్టేబుల్ అభ్యర్థుల్లో 300 మందికి నేర చరిత్ర
పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లలో కొంత మందిపై కేసులున్నట్లు పోలీస్ నియామక మండలి గుర్తించింది. పోలీస్ నియామక మండలి 2018 మే నెలలో సుమారు 17వేల కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాథమిక అర్హత, దేహదారుఢ్య, ప్రధాన పరీక్షల్లో అర్హత సాధించిన వాళ్లను కానిస్టేబుళ్లుగా ఎంపిక చేశారు. 13,373 మంది పురుషులు, 2,652 మంది మహిళలు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు.
ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఈ వారంలో శిక్షణ ప్రారంభం కానున్న తరుణంలో.... పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో అభ్యర్థుల పూర్తి వివరాలకు సంబంధించి విచారణ చేయించారు. వీరిలో సుమారు 300 మందిపైన కేసులున్నట్లు తేలింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో తమపై ఉన్న కేసుల గురించి పేర్కొనాల్సి ఉంటుంది. కొంతమంది కేసుల గురించి దాచిపెట్టినా.... పోలీస్ నియామక మండలి ఆధ్వర్యంలో చేయించిన వ్యక్తిగత పరిశీలనలో కేసుల విషయాలు బయటపడ్డాయి. దీంతో వాళ్లను శిక్షణకు అనుమతించాలా వద్దా అనే అంశంపై పోలీస్ నియామక మండలి ఉన్నతాధికారులు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఇవీ చూడండి: గోదావరి, కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల ఏకాభిప్రాయం
TAGGED:
taza