తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీసుల కరోనా డ్రైవ్​.. మాస్కు లేనివారికి వెయ్యి ఫైన్​ - corona drive latest news

రాష్ట్రంలో కరోనా విజృంభణ దృష్ట్యా అధికారులు, పోలీసులు ఆంక్షలను కఠినంగా అమలు చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బయటికి వస్తున్న వారిపై కొరడా ఝుళిపిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు.

పోలీసుల కరోనా డ్రైవ్​
పోలీసుల కరోనా డ్రైవ్​

By

Published : Apr 11, 2021, 12:43 PM IST

హైదరాబాద్‌ జియాగూడలోని కమేళా, బేగంబజార్‌లోని చేపల మార్కెట్‌లో పోలీసులు కరోనా డ్రైవ్‌ నిర్వహించారు. మాస్కులు ధరించకుండా బయట తిరుగుతున్న వారిని గుర్తించి.. రూ.1000 జరిమానా విధించారు. కరోనా జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ.. వైరస్‌ కట్టడికి సహకరించాలని కోరుతున్నారు.

ప్రధానంగా హైదరాబాద్‌తో పాటు ముఖ్య పట్టణాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటున్నందున అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించేలా తగు చర్యలు తీసుకుంటున్నారు.

ఇదీ చూడండి: కరోనా అలర్ట్: రాష్ట్రంలో కొత్తగా మరో 3187 కొవిడ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details