తెలంగాణ

telangana

ETV Bharat / state

Complaint onSai pallavi: సాయి పల్లవిపై పీఎస్​లో ఫిర్యాదు.. ఎందుకంటే?

Sai pallavi
సినీనటి సాయి పల్లవి

By

Published : Jun 16, 2022, 4:56 PM IST

Updated : Jun 16, 2022, 9:27 PM IST

16:55 June 16

Complaint onSai pallavi: సినీనటి సాయి పల్లవిపై సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఫిర్యాదు

సాయి పల్లవిపై సుల్తాన్‌బజార్‌ పీఎస్‌లో ఫిర్యాదు

Complaint onSai pallavi: విరాటపర్వం సినిమాలో నటించిన సినీనటి సాయి పల్లవిపై హైదరాబాద్‌ సుల్తాన్‌బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమాతో పాటు గోరక్షకులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని భజరంగ్‌దళ్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సాయి పల్లవిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యాయసలహా తీసుకొని సాయిపల్లవిపై చర్యలు తీసుకుంటామన్న పోలీసులు తెలిపారు.

ఇంతకీ సాయి పల్లవి ఏమన్నారంటే..:తాను ప్రధాన పాత్ర పోషించిన ‘విరాటపర్వం’ సినిమా ప్రచారంలో భాగంగా సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్‌.. సాయి పల్లవి నేపథ్యం గురించి ప్రశ్నించగా ఆమె స్పందించారు. లెఫ్ట్‌వింగ్‌, రైట్‌వింగ్‌ గురించి విన్నానని, తాను మాత్రం న్యూట్రల్‌గా ఉంటానని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ‘కశ్మీర్‌ ఫైల్స్‌’ సినిమా గురించి మాట్లాడారు. ‘‘90ల్లో కశ్మీర్‌ పండిట్లను ఎలా చంపారో ఆ చిత్రంలో చూపించారు కదా..! కొవిడ్‌ సమయంలో ఓ ప్రాంతంలో గోవును వాహనంలో తరలించారు. దాని డ్రైవర్‌ ఓ ముస్లిం. కొంతమంది అతడిని కొట్టి జై శ్రీరాం, జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. అప్పుడు జరిగిన దానికి, ఇప్పుడు జరిగిన దానికి తేడా ఏముంది? మనం మంచిగా ఉండాలి. ఎదుటివారిని ఇబ్బంది పెట్టకూడదు’’ అంటూ సాయిపల్లవి తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:'కాలర్ పట్టుకున్నందుకు రేణుకపై.. బస్సు ధ్వంసం చేసినందుకు కార్యకర్తలపై కేసులు'

జస్టిస్​ ఎంఆర్​ షాకు తీవ్ర అస్వస్థత- స్పెషల్ ఫ్లైట్​లో దిల్లీకి...

Last Updated : Jun 16, 2022, 9:27 PM IST

ABOUT THE AUTHOR

...view details