Passport Police Clearance Certificate: విద్య, ఉపాధి అవకాశాలు, పర్యాటక అవసరాలకు విదేశాలకు వెళ్లేవారి సంఖ్యక్రమంగా పెరుగుతోంది. అలా వెళ్లేవారికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు (పీసీసీలు) కావాలని పలు దేశాలు అడుగుతుడంటతంతో రోజురోజుకు వాటికి డిమాండ్‌పెరుగుతోంది. ఇప్పటివరకు పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల ధరఖాస్తుల పరిశీలన పాస్‌పోర్టు సేవాకేంద్రాల్లో మాత్రమే చేసేవారు. డిమాండ్‌కు తగ్గట్లు పీసీసీల ధరఖాస్తుల పరిశీలన సకాలంలో పూర్తికాకపోవడంతో సెలవురోజుల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటుచేసి పూర్తిచేస్తున్నారు.
రాష్ట్రంలో రెండు శనివారాలు ఇందుకోసం ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసి దాదాపు మూడున్నర వేల దరఖాస్తుల పరిశీలన పూర్తిచేశారు. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకుంటున్న పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ల ధరఖాస్తుల పరిశీలనా ప్రక్రియకు పాస్‌పోర్టు కేంద్రాల సామర్థ్యం సరిపోకపోవడం వల్ల స్లాట్‌బుకింగ్ ఆలస్యమై దరఖాస్తుదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
ఎంపిక చేసిన తపాల కార్యలయాల్లో ధరఖాస్తులు పరిశీలన:ఆ సమస్యను అధిగమించేందుకు విదేశాంగ మంత్రిత్వశాఖ పాస్‌పోర్టు సేవా కేంద్రాలతోపాటు దేశవ్యాప్తంగా ప్రధాన తపాలా కార్యాలయాలను పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్ ధరఖాస్తుల పరిశీలనకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. నిర్దేశించిన తపాలాకార్యాలయాల్లో వెరిఫికేషన్ కోసం ఆన్‌లైన్ ద్వారా స్లాట్‌బుకింగ్ చేసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి నుంచి దేశవ్యాప్తంగా నిర్దేశించిన తపాలా కార్యాలయాలు ధరఖాస్తుల పరిశీలనకు అందుబాటులోకి రానున్నాయి.