తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం రవాణా... సరిహద్దులో ఉరుకులు పరుగులు - కర్నూలులో మద్యం అక్రమ రవాణా వార్తలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని పుల్లూరు చెక్​పోస్టు వద్ద ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. అక్రమ మద్యం రవాణా చేస్తున్న పలువురిని పరుగులు పెట్టించారు.

police-checks-on-illegal-liquore-at-kurnool-district
మద్యం అక్రమ రవాణా... అక్రమార్కులను పరుగులు పెట్టించిన పోలీసులు

By

Published : Jun 16, 2020, 1:27 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లాలో నాటుసారా తయారీ, అక్రమ మద్యం రవాణాలపై పోలీసులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని పుల్లూరు చెక్​పోస్టు వద్ద ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. పోలీసులను చూసి పరిగెత్తిన ఓ వ్యక్తిని వెంబడించి పట్టుకున్నారు. సదరు వ్యక్తి బ్యాగులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన మద్యం బాటిళ్లు గుర్తించారు.

మరోవైపు మరికొందరు మాత్రం వాహనాలను ఆపకుండా పోలీసులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నాటు సారా అమ్మకందారులు, అక్రమ మద్యం రవాణా చేసే 25 మందిని పోలీసులు అరెస్టు చేయడంతో పాటు 5 వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు.

ఇవీ చూడండి:అసత్య ప్రచారాలు సరికాదు.. నేను ఆరోగ్యంగానే ఉన్నాను: పద్మాదేవేందర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details