హైదరాబాద్ అబిడ్స్ కూడలిలో సివిల్, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. ఉదయం 10 దాటాకా కూడా రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై పోలీసులు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏడవ రోజు లాక్డౌన్లో భాగంగా ప్రతి ఒక్క వాహన దారుడిని ఆపి... ఐడీ కార్డులు పరిశీలించి... అనవసరంగా బయటకు వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.
అబిడ్స్ కూడలిలో పోలీసుల తనిఖీలు - police checkings in hyderabad
లాక్డౌన్ సడలింపు సమయంలో తప్ప ఇతర సమయాల్లో రోడ్లపైకి వస్తున్న వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు.

అబిడ్స్ కూడలిలో పోలీసుల తనిఖీలు
రెండు పర్యాయాలు చెప్పిన్నప్పటికీ వినని వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమలుకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం లాక్డౌన్ విధించిందని... ప్రజలందరూ ఇంట్లోనే ఉంటూ తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న కానిస్టేబుల్ వీడియో