హైదరాబాద్లో పోలీసులు లాక్డౌన్ను పటిష్ఠంగా అమలు చేస్తున్నారు. గోషామహల్ కూడలి వద్ద ఏసీపీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత రోడ్లపైకి వస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
గోషామహల్లో గంట వ్యవధిలో 55 వాహనాలు సీజ్ - Hyderabad lock down2021
రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. హైదరాబాద్ గోషామహల్ కూడలి వద్ద ఏసీపీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్లో లాక్డౌన్, గోషామహల్లో వాహన తనిఖీలు
కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై షాహినాజ్ గంజ్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అనుమతి లేకుండా రోడ్లపైకి వచ్చిన వాహనాలను జప్తు చేసి కేసు నమోదు చేస్తున్నారు. గంట వ్యవధిలో సుమారు 55 వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.