Police Checking in Telangana During Election Code :గత శాసనసభ ఎన్నికలతో పోల్చితే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 41 లక్షలకు పైగా పెరిగింది. 2018 ఎన్నికల సమయంలో ఓటర్ల సంఖ్య 2,80,75,914.. ఈ నెల మూడో తేదీ వరకు పరిష్కరించిన దరఖాస్తుల ప్రకారం ఓటర్ల సంఖ్య 3,22,04,148కు చేరుకుంది. అక్టోబర్ నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరిస్తే ఈ సంఖ్య మరికాస్త పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో పురుష ఓటర్లు 1,60,97,014 మంది ఉండగా.. మహిళా ఓటర్లు(Telangana Female Voters) 1,60,89,156 మంది ఉన్నారు. థర్డ్ జెండర్ ఓటర్లు 2,583 మంది, సర్వీసు ఓటర్లు 15,395 మంది, ప్రవాస ఓటర్లు 2,859 మంది ఉన్నారు.
Telangana Voters Details 2023: 2018 ఎన్నికల సమయంలో ప్రవాస ఓటర్ల సంఖ్య కేవలం 244 కాగా.. ఈసారి ఏకంగా 2,859గా నమోదైంది. సర్వీసు ఓటర్లు ఐదు వేలకు పైగా పెరిగారు. రాష్ట్రంలో 18 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 9,10,810.. 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న ఓటర్ల సంఖ్య 62,58,84గా ఉంది. 30 నుంచి 40 ఏళ్ల మధ్య 1,22,566 మంది.. 41 నుంచి 60 ఏళ్ల మధ్య 1,08,03,759 మంది ఓటర్లు ఉన్నారు. 60 ఏళ్లకు పైబడిన ఓటర్ల సంఖ్య 41,93,534గా ఉంది. అలాగే 80 ఏళ్లకు పైబడిన ఓటర్ల సంఖ్య 4,39,566గా.. ఓటర్ల జాబితాలో దివ్యాంగుల సంఖ్య 5,06,779 ఉంది.
ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
2023 ఎన్నికల ఓటర్ల వివరాలు :
ఓటర్లు | 2018లో | 2023లో |
మొత్తం ఓటర్ల సంఖ్య | 2,80,75,914 | 3,22,04,148 |
పురుషులు | 1,60,97,014 | |
మహిళలు | 1,60,89,156 | |
థర్డ్ జెండర్ | 2,583 | |
సర్వీసు ఓటర్లు | 15,395 | |
ప్రవాస ఓటర్లు | 244 | 2,859 |
18 నుంచి 19 ఏళ్ల మధ్య | 9,10,810 | |
20 నుంచి 29 ఏళ్ల మధ్య | 62,58,84 | |
30 నుంచి 40 ఏళ్ల మధ్య | 1,22,566 | |
41 నుంచి 60 ఏళ్ల మధ్య | 1,08,03,759 | |
60 ఏళ్లకు పైబడిన వారు | 41,93,534 | |
80 ఏళ్లకు పైబడిన వారు | 4,39,566 | |
దివ్యాంగులు | 5,06,779 |
Police Seize Liquor, Gold in Telangana : ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు రూ.453 కోట్లకు పైగా నగదు, ఆభరణాలు, మద్యం, ఇతరాలను స్వాధీనం చేసుకున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. గడచిన 24 గంటల్లో రూ.7.98 కోట్లు నగదు.. అక్టోబర్ తొమ్మిది నుంచి రూ.164.11 కోట్ల నగదు పట్టుబడినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.52.93 కోట్ల విలువైన మద్యం, 27.58 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం(Police Seized Drugs) చేసుకున్నారు.