తెలంగాణ

telangana

ETV Bharat / state

హవాలా డబ్బు ఉందన్న సమాచారంతో.. చీకోటి వాహనాలు తనిఖీ - Telugu latest news

Chikoti Praveen vehicle Inspection in AP : హైదరాబాద్​ క్యాసినో వ్యవహారి చీకోటి ప్రవీణ్‌ వాహనాన్ని కోనసీమ జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు.. సంక్రాంతి సందర్భంగా ఆంధ్రలో క్యాసినో నిర్వహిస్తారనే సమాచారంలో సోదాలు నిర్వహించారు..

Chikoti Praveen
Chikoti Praveen

By

Published : Jan 15, 2023, 8:00 AM IST

ఏపీలో చీకోటి వాహనాలు తనిఖీ

Chikoti Praveen vehicle Inspection in AP : కోనసీమ జిల్లా మామిడికుదురులో క్యాసినో వ్యవహారి చీకోటి ప్రవీణ్‌ను రాజోలు పోలీసులు తనిఖీ చేశారు. హవాలా సొమ్ము ఉందన్న సమాచారంతో.. సంక్రాంతి నేపథ్యంలో కోడిపందేలకు స్నేహితులతో కలిసి వచ్చిన చికోటి ప్రవీణ్​ను.. హవాలా సొమ్ము ఉందన్న సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు నాలుగు వాహనాల్లో వచ్చిన 20 మందిని ఇద్దరు ఎస్సైలు కృష్ణమాచారి, బాషాలు తనిఖీలు నిర్వహించారు. వాహనాలలో ఏమీ లభ్యం కాకపోవడంతో.. వివరాలు సేకరించి వదిలేశారని చీకోటి ప్రవీణ్‌ తెలిపారు.

"ఎటువంటి ఇబ్బంది పెట్టలేదు.. రొటీన్ చెకప్​​ చేశారు. ఇబ్బంది ఏమీ లేదు.. ఏమైనా అడిగితే రోడ్డుపై వాహనాలను చెక్​ చేస్తున్నామని చెప్పారు.. డబ్బులు ఏమైనా దొరకుతాయని అనుకున్నారు.. కానీ ఏమీ దొరకలేదు.. కేవలం సరదా పర్యటనకు వచ్చారు.. ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలకు జరపాలని నేను ఆంధ్రప్రదేశ్​కు రాలేదు." చీకోటి ప్రవీణ్‌

Cockfights in AP : రాష్ట్రవ్యాప్తంగా కోళ్లు కత్తులు దూశాయి. కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో విచ్చలవిడిగా కోడిపందేలు సాగాయి. వైసీపీ నాయకులే దగ్గరుండి పందేలను ప్రోత్సహించడం.. పోలీసుల మీదే కేకలు వేస్తూ పెత్తనం చెలాయించడంతో మిగిలినవారూ లెక్కచేయని పరిస్థితి. కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదురేశ్వరం రోడ్డులో కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ చిర్ల జగ్గిరెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తంచేయడం చర్చనీయాంశమైంది.

అమలాపురం మండలం వన్నెచింతపూడిలో జగనన్న లేఅవుట్‌లో కోడిపందేల బరిని అధికార పక్షం నాయకులు ఏర్పాటు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, గోకవరంలో ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కోడిపందేలు ప్రారంభించారు. ఆయా వేదికలవద్ద రూ.లక్షల్లో పందేలు సాగాయి. తాళ్లరేవు మండలంలో జార్జిపేటలో రాష్ట్ర స్థాయి బరి ఏర్పాటు చేశారు. మంత్రి విశ్వరూప్‌ కుమారుడు పందేలను వీక్షించారు. ఒక్కో పందెం రూ.6 లక్షలతో మొదలైంది. ఇక్కడ గుండాటను పోలీసులు అడ్డుకున్నా.. కోడిపందేలు ఆగలేదు.

చేతులు మారిన కోట్ల రూపాయలు : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం సీసలిలో లెక్కింపు యంత్రాల ద్వారా పందేల నగదు లావాదేవీలు సాగాయి. భీమవరం మండలం డేగాపురం, ఆకివీడు మండలం దుంపగడపలో శుక్రవారం దాకా కబడ్డీ పోటీలు జరిపితే.. అదే ప్రాంగణం కోడి పందేలకు వేదికైంది. నిడమర్రు, సీసలి, డేగాపురంలో డిజిటల్‌ స్క్రీన్లలో పందేలు వీక్షించే ఏర్పాట్లు చేశారు. ఒక్కో పందేనికి బరిలో 10 లక్షల రూపాయలు బయట 50 లక్షల రూపాయల దాకా బెట్టింగులు సాగాయి. ఒక్కో బరిలో రూ.కోటి వరకు చేతులు మారాయి. పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాలు కిక్కిరిశాయి.

కైకలూరు మండలం చటాకాయ్‌ గ్రామంలో కోడిపందేల బరిలో రెండు కోళ్లూ నెగ్గినట్లు ప్రకటించడంతో వివాదం తలెత్తింది. తాడేపల్లిగూడెంలో పందేల దగ్గర జరిగిన తోపులాటలో ఒకరి కాలు విరిగింది. నిడమర్రు మండలంలోని మందలపర్రులో ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. కాళ్ల మండలం సీసలి బరిలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు దగ్గరుండి పందేలు నిర్వహించారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో ఎమ్మెల్యే తెల్లం బాలరాజు గిరిజనుల సంప్రదాయ కోడి పందేలను ప్రారంభించారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో భోగి రోజు వేసిన పందేలు, జూదాలు అన్నీ కలిపి దాదాపు రూ.400 కోట్లు చేతులు మారినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details