తెలంగాణ

telangana

ETV Bharat / state

చిన్నారి కిడ్నాప్... నిందితులను పట్టించిన సీసీటీవీ - చిన్నారి కిడ్నాప్ వార్తలు

చిన్నారి కిడ్నాప్​కు గురైన కేసును బోయిన్​పల్లి పోలీసులు రెండు గంటల్లోనే ఛేదించారు. దౌల్తాబాద్​కు చెందిన చిన్నారిని ఇద్దరు వ్యక్తులు అపహరించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా... పోలీసులు నిందితులను పట్టుకున్నారు.

చిన్నారి కిడ్నాప్... నిందితులను పట్టించిన సీసీటీవీ
చిన్నారి కిడ్నాప్... నిందితులను పట్టించిన సీసీటీవీ

By

Published : Jun 23, 2020, 12:14 PM IST

Updated : Jun 23, 2020, 12:27 PM IST

సికింద్రాబాద్‌లో చిన్నారిని అపహరించిన ఘటనలో... ఫిర్యాదు అందిన రెండు గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బస్‌స్టాప్ సమీపంలో మూడేళ్ల చిన్నారి తప్పిపోయింది. దౌల్తాబాద్‌కు చెందిన స్వరూప భర్తతో గొడవపడి చిన్నారితో కలిసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఆమెను గమనించిన ఇద్దరు వ్యక్తులు తిరిగి ఇంటికి పంపిస్తామని నమ్మించారు. చిన్నారి తల్లి హోటల్‌కు వెళ్లగా... అదునుగా భావించిన మహిళ పాపతోపాటు మరో వ్యక్తితో కలిసి నిజామాబాద్‌కు వెళ్లే బస్సు ఎక్కింది.

పాపతో పాటు వారిద్దరూ కనిపించకపోవడంతో తల్లి బోయిన్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా బస్సు రామాయంపేట వరకు చేరిందనే సమాచారంతో అక్కడి పోలీసులను అప్రమత్తం చేశారు. వారు బస్సును ఆపి చిన్నారిని క్షేమంగా తల్లికి అప్పగించారు.

చిన్నారి కిడ్నాప్... నిందితులను పట్టించిన సీసీటీవీ

ఇవీ చూడండి:ఆత్మాభిమానానికి... 'ఆకృతి'నిస్తోంది!

Last Updated : Jun 23, 2020, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details