sound pollution in City: హైదరాబాద్‌ను నో-హాంక్ సిటీగా మార్చేందుకు పోలీస్ ఉన్నతాధికారులు కృషి చేస్తున్నారు. శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు ఉపక్రమించారు. రోడ్లపై ఇష్టారీతిగా హారన్ మోగించే వారిపై జరిమానాలు విధించనున్నారు. పరిమితికి మించి శబ్దం చేసే వాహనాలపై చలాన్లు వేయనున్నారు. బిజీగా ఉన్న రోడ్డుపై... ఏ వాహనం ఎంత పెద్దగా శబ్దం చేసిందో... తెలుసుకోవడం కష్టం. సిగ్నళ్ల వద్ద ఆగిన సమయంలోనూ... పరిమితికి మించి హారన్ మోగించారా అని తెలుసుకునేందుకు జర్మనీ నుంచి ప్రత్యేక సాంకేతికతను తెప్పిస్తున్నారు. శబ్దాలను గుర్తించేలా లోకల్ సెన్సర్ సాఫ్ట్‌వేర్‌ను ప్రత్యేకంగా అమర్చుతారు. ఇవి వాహనాల శబ్దాన్ని రికార్డు చేయడంతోపాటు... ఆ వాహనం నంబర్‌తో సహా ఫోటో తీస్తుంది. ఎన్ని వాహనాలు పరిమిత శబ్దానికి మించి హారన్ మోత మోగిస్తాయో ఆయా వాహనాల ఫోటోలన్నింటినీ తీస్తుంది. ఆ ఫోటోలను ప్రత్యేక సాఫ్ట్‌వేర్ ద్వారా కమాండ్ కంట్రోల్‌రూమ్‌కు పంపుతుంది. అక్కడి నుంచి ఆయా వాహనాలకు ఈ-చలాన్‌లు వెళ్తాయి.
sound pollution in City: ఇష్టారీతిగా హారన్ మోగిస్తే.. చలానా పడుద్ది జాగ్రత్త..! - హారన్
sound pollution in City: హైదరాబాద్ రహదారులపై ఇష్టారాజ్యంగా హారన్ మోగిస్తూ వెళ్తున్నారా...? ముందున్న వాహనాలు పక్కకు జరగాలంటూ పదేపదే హారన్ కొడుతున్నారా..?. పాఠశాలలు, ఆసుపత్రుల వద్ద ఎక్కువ శబ్దం చేసుకుంటూ వెళ్తున్నారా...? ఇకపై కుదరదు. హారన్ల మోతతో వాహనదారులు, ప్రజలు, పాదచారుల ఆరోగ్యం దెబ్బతింటోందన్న సర్వేల నేపథ్యంలో శబ్దకాలుష్య కట్టడికి హైదరాబాద్ పోలీసులు ఇకపై కఠినంగా వ్యవహరించనున్నారు.
శబ్ద కాలుష్యాన్ని తగ్గించేందుకు వాహనాల్లో ఏ తరహా హారన్లు ఉపయోగించాలో తెలుసుకునేందుకు కొన్ని కార్ల కంపెనీల ప్రతినిధులతో ట్రాఫిక్ సంయుక్త కమిషనర్ ఏవీ రంగనాథ్ చర్చించారు. ఆ వివరాలను డీజీపీ మహేందర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. హారన్లమోత, బైకులు, బస్సులు, ఆటోల ద్వారా వస్తున్న శబ్దకాలుష్యం, సైలెన్సర్లు తీసేయడం వంటివాటిపై చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాలను సిద్ధం చేయాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. ఈ మార్గదర్శకాలపై నెలరోజులపాటు వాహనదారులకు అవగాహన కల్పించాక హారన్‌మోత మోగించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు.
ఇదీ చూడండి:
High court: హైకోర్టుకు మరో 10 మంది న్యాయమూర్తులు.. రేపే ప్రమాణ స్వీకారం